1. శ్రీ కృష్ణుడికి ద్రౌపది రాఖి కట్టిన సందర్భం గురించి వివరణ :
శిశుపాలును వధించినపుడు చేతికి గాయం అవడంతో పాండవుల పట్టా మహిషి ఐన ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చింపి రక్తం కారకుండా కట్టు కట్టిందంట. ఆ చిన్న సాయానికి అమిత ఆనందం పొందిన శ్రీ కృష్ణుడు ఆమె ఆనందం కోసం తరువాతి 25 ఏళ్ళు పాండవుల పక్షపాతిగానే ఉన్నాడు
2. బలిచక్రవర్తికి లక్ష్మి దేవి రాఖి కట్టిన సందర్భం గురించి వివరణ :
పూర్వం బాలి మహారాజు భక్తి కి మెచ్చి సాక్షాత్తు విష్ణు మూర్తి తన రాజ్యాన్ని కాపాడే పని మీద లక్ష్మి దేవిని వైకుంఠం లోనే వదిలి వెళ్ళాడట. అప్పుడు లక్ష్మి దేవి భర్త ఎక్కడ ఉంటె అదే వైకుంఠముగా భావించి మానవ స్త్రీగా వెళ్లి తన భర్త వచ్చే దాక అన్నగా కాపాడమని బాలి చక్రవర్తి ని కోరిందంట. శ్రావణ పౌర్ణమి రోజున ఆమె ఒక పట్టు దారం బలి చక్రవర్తి కుడి చేతికి కట్టి జరిగిన విషయం చెప్పింది. అది విన్న బలి చక్రవర్తి ఆహా ఏమి నా భాగ్యం, నన్ను అనుగ్రహించడానికి మీరు ఇంట శ్రమ తీసుకున్నారు అని సకల మర్యాదలతో లాంఛనాలతో తోబుట్టువును అప్పగించినట్టు విష్ణు మూర్తికి లక్ష్మి దేవిని అప్పగించాడట బలి చక్రవర్తి. ఆ రోజు నుండి శ్రావణ పూర్ణిమ రక్షా బంధనముగా ఏర్పడింది.
3. యముడి చెల్లెలు యమున తన అన్న యముడికి రాఖీ కట్టిన సంధర్భం గురంచి వివరణ :
యముడి చెల్లెలు యమునా దేవి కూడా ఈరోజున రాఖీ కట్టిందంట. ఫలితంగా ఆమె జీవ నది గా ఎప్పటికి ఉండే వరాన్ని ఇచ్చాడు .
4. ధర్మరాజు ధర్మ రక్షణ , విజయం కొరకు శ్రీ కృష్ణుడి సలహాతో రక్షా కంకణాన్ని ధరించి విజయం పొందడం (ఇంద్రుడికి శచీదెవి రక్షా కట్టిన సంధర్భం గురంచి వివరణ ) :
ధర్మరాజు ఒకరోజు శ్రీ కృష్ణిడితో కష్టాలను తట్టుకోవడం ఎలాగని అడిగాడు. అందుకు శ్రీ కృష్ణుడు ,రక్ష ధరించవలసిందిగా ధర్మరాజుకు సలహా ఇచ్చాడు . శ్రీ కృష్ణుడు ఈ సందర్బంగా ఇంద్రుడు కథ చెప్పాడు . ఒక సారి రాక్షసులతో చాలకాలం యుద్ధం జరిగింది . చివరికి దానవులదె పైచేయి కావడంతో ఇంద్రుడు ఓడిపోయాడు. అప్పుడు భార్య శచీ దేవి, గురువు బృహస్పతి శ్రావణ పూర్ణిమనాడు ఇంద్రుడి ముంజేతికి రక్ష కట్టి యుద్దానికి ఉత్తేజపరిచారు. యుద్ధంలో ఇంద్రుడి రాక్షసులను సునాయాసంగా ఓడించాడు . అది విని ధర్మరాజు తానూ కడా రక్షాబంధన దినోత్సవం నాడు రక్షను ధరించి , కష్టాల నుండి విముక్తిని పొందాడు . రక్షా బంధనం సామజిక శ్రేయస్సుకు పాటు పడవలసిందిగా కూడా హితవు చెప్పింది.
SOURCE : Internet