Sri Venkateswara Swamy Temple Wanaparthy


Sri Venkateswara Swamy Temple Wanaparthy


వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమును 1977 సంవత్సరము ఫాల్గుణ శు|| పంచమి బుధవారం అశ్విని నక్షత్రమున తేదీ 23-02-1977  శ్రీ శ్రీ శ్రీ  త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ  రామానుజ  జీయర్ స్వామి వారిచే ముహూర్తము నిర్ణయించబడి వారి స్వహస్తములచే ప్రతిష్టించబడినది. ప్రతిష్ట సమయమునందు వారము రోజులు వారు వేంచేసి 26 వ స్వాద్యయా జ్ఞానయజ్ఞమును నిర్వహించారు. తదుపరి కాలంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిచే శ్రీరామ స్తూపము ప్రతిష్ట గావించి బడినది.   


Sri Venkateswara Swamy Temple Wanaparthy


మన అపర రామానుజులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు మన పెద్ద జీయరు స్వామి వారి ఆదేశము మేరకు అధిక జ్ఞానసముపార్జనకై నడిగడ్డ పాలెం ఆశ్రమములో చేరుటకై  అదే ముహూర్తము నందు వనపర్తి నుండే బయలుదేరారు.


Sri Venkateswara Swamy Temple Wanaparthy


 శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు స్వహస్తాలతో శ్రీ సుదర్శన నారసింహ స్వామి, శ్రీ విశ్వక్సేన పెరుమాళ్ళ ప్రతిష్ట, ఆళ్వారుల, భగవత్ రామానుజుల, మానవలామహమునుల మూల మూర్తులను, రాజగోపురం కలశ ప్రతిష్ట, ప్రకారము, అధ్యయన మంటపములను ప్రారంభోత్సవం చేశారు.  


Sri Venkateswara Swamy Temple Wanaparthy


ఈ ఆలయములో బ్రహ్మోత్సవములు, పవిత్రోత్సవములు, అధ్యనోత్సవములు, ధనుర్మాస ఉత్సవములు మరియు అన్ని ఉత్సవములు అన్ని తిరునక్షత్రాలు నిర్వహిస్తూ, ప్రతి శుక్రవారం స్వామి వారికీ అభిషేకములు, విశేష కార్యక్రమములు మరియు అన్ని పండుగలు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవములు అన్నియు పాంచరాత్ర ఆగమము ప్రకారము శాస్త్రీయంగా భక్తుల యొక్క విశేష సహకారములచే నిర్వహించుబడుచున్నవి.


Sri Venkateswara Swamy Temple Wanaparthy


ఇదే గుడికి తూర్పు వైపు ఆంజనేయ స్వామి, శివుడు మరియు నవగ్రహ ఆలయము కలదు.   

HOW TO REACH :

ఈ ఆలయము వనపర్తి నడిబొడ్డున కలదు. వనపర్తి బస్టాండ్ నుండి 1 km  కలదు.

LOCATION :